కోటీ 45లక్షలతో సిటిజన్ సర్వీస్ సెంటర్

130
gangula
- Advertisement -

కరీంనగర్ ప్రజలకు మెరుగైన సేవలందించడానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిరంతరం క్రుషి చేస్తూనే ఉంటారు, దీనికి తాజా నిదర్శనం మంగళవారం సిటిజన్ సర్వీస్ సెంటర్ భవనానికి 1 కోటీ 45 లక్షల రూ. వ్యయంతో చేసిన భూమిపూజ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ నిరంతరం అండగా ఉండడంతో మంత్రి గంగుల సీఎం లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా క్రుషి చేస్తున్నారు. ఓవైపు స్మార్ట్ సిటీ పనుల్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు దాదాపు 600 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ పనుల్ని వేగవంతం చేస్తున్న గంగుల, నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి కరీంనగర్ నగరపాలక సంస్థలో ఏర్పాటుచేసిన సిటిజన్ సర్వీస్ సెంటర్ విభాగానికి మున్సిపల్ కార్యాలయంలో రూ.1 కోటి 45 లక్షల వ్యయంతో నిర్మించే నూతన భవనానికి ఈరోజు భూమి పూజ చేసారు. సమస్య ఎక్కడున్నా తక్షణమే స్పందిస్తూ, నగరంతో పాటు నియోజకవర్గానికి అభివ్రుద్దిని శరవేగంగా చేరవేస్తున్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల తో పాటు నగర మేయర్ వై.సునీల్ రావు ,డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి -హరీశంకర్, కమిషనర్ ఎన్.యాదగిరిరావు ,కార్పొరేటర్లు బుచ్చిడ్డి, వాల రమణారావు,ఘంట కల్యాణి, రవీందర్ సింగ్, నాయకులు ఆకుల నర్సయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -