బీజేపీకి గట్టి హెచ్చరికనే ఇది !

253
- Advertisement -

ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలలో విజయం సాధించే పార్టీ ఏదనే చర్చకు తెరపడింది. గుజరాత్ లో బీజేపీ తన విజయాన్ని మళ్ళీ పునరావృతం చేయగా, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే గుజరాత్ ఎన్నికల విజయం ఎలా ఉన్నప్పటికీ.. హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఓటమి మాత్రం సరికొత్త చర్చకు తావిస్తోంది. ఎందుకంటే గుజరాత్ లో బీజేపీ గెలవడం పెద్ద విషయమేమి కాదు. కారణం దేశాన్ని పాలిస్తున్న మోడి, అమిత్ షా లు ఆరాష్ట్రనికి చెందిన వారే.. కాబట్టి బీజేపీకి అక్కడ గెలుపు నల్లేరు మీద నడకే. .

అందుకే మొదటి నుంచి కూడా గుజరాత్ పై కాకుండా హిమాచల్ ప్రదేశ్ పైన దృష్టి పెట్టింది బీజేపీ అధిష్టానం. మోడి, అమిత్, నడ్డా వంటి జాతీయ నాయకులతో ప్రచారాలు నిర్వహించి, డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి హిమాచల్ ప్రదేశ్ ఓటర్లను అమితంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీ గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఊహించని విధంగా కాంగ్రెస్ కు విజయాన్ని కట్టబెట్టి, బీజేపీ ని రెండవ స్థానానికే పరిమితం చేశారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయింది, మరో మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.

కాగా హిమాచల్ ప్రదేశ్ లో అధికార మార్పిడి అనేది కొత్తేమీ కాదు గత 37 ఏళ్లుగా ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ప్రజలు 2022 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే అధికారాన్ని మార్చడం ఇక్కడి ప్రజలు మొదటి నుంచి కొనసాగిస్తున్నప్పటికి,ఈ ఎన్నికల్లో ఓటమి బీజేపీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఓటమి ప్రభావం చూపే అవకాశం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ ఎంత చెబుతున్నప్పటికి ప్రజా తీర్పు మారుతుందనే విషయం స్పష్టమౌతుంది. ఇక వచ్చే ఏడాది తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే బిజేపీ కల్లబొల్లి కహానీలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేదనేది కాదనలేని వాస్తవం. ఇక ఆయా రాష్ట్రాలలో కూడా బిజేపీ మతతత్వ రాజకీయాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజేపీపై ప్రజా తీర్పు మారే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనప్పటికి హిమాచల్ ప్రదేశ్ లో బిజేపీ ఓటమి.. రాబోయే రోజుల్లో ఆపార్టీ కి జరిగే నష్టానికి హెచ్చరికగానే భావించక తప్పదు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -