‘రంగ మార్తాండ’ కి మోక్షం ఎప్పుడో ?

133
rangamarthanda
- Advertisement -

టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఓ సెపరేట్ బ్రాండ్ ఉంది. అందులో కృష్ణవంశీ ఒకరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన బ్రాండ్ పడిపోయింది. ప్రేక్షకుల్లో ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అలానే ఉంది కానీ ఆయన సినిమాల మీద మాత్రం ఎవరికీ అంచనాలు ఉండట్లేదు. నిజానికి సక్సెస్ , ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా కొందరికి మార్కెట్ ఉంటుంది కానీ కృష్ణవంశీ మార్కెట్ ఇప్పుడు మార్కెట్ లేదు. ‘మొగుడు’, ‘పైసా’, ‘గోవిందుడు అందరివాడేలె’ ‘నక్షత్రం’ సినిమాలు వంశీ మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి.

దీంతో ఆయన తీసిన ‘రంగమార్తాండ’ కి ఇప్పుడు బిజినెస్ కష్టాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. మధ్యలో ప్రకాష్ రాజ్ డేట్స్ వల్ల కాస్త ఆలస్యం జరిగింది. మొన్నీ మధ్యే మిగిలిన నాలుగైదు రోజుల షూట్ కూడా పూర్తయింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కృష్ణవంశీ మీడియా ముందుకొచ్చి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలేవి సినిమాకు ప్లస్ అవ్వలేదు. పైగా కృష్ణవంశీ గత సినిమాలా మీదే ఎక్కువ మాట్లాడి మీడియాకి కావాల్సిన స్టఫ్ ఇచ్చారు. ఇప్పటికీ సినిమాకు బిజినెస్ అవ్వలేదని తెలుస్తుంది.

తాజాగా కృష్ణవంశీ తన సోషల్ మీడియాలో బ్రహ్మానందం , రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను షేర్ చేస్తూ బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కృష్ణవంశీ ఇంకా డబ్బింగ్ ఫోటోలనే పెడుతూ రిలీజ్ డేట్ మాత్రం చెప్పడం లేదు. వంశీ సినిమా చూద్దామనుకునే కొందరు ప్రేక్షకులు డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరాఠి నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రమ్య కృష్ణ ,బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి రంగమార్తండ రిలీజ్ మోక్షం ఎప్పుడు కలుగుతుందో ?

ఇవి కూడా చదవండి..

- Advertisement -