కాషాయ పార్టీ ఏపీలో బలపడాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందివచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వినియోగించుకునేందుకు విశ్వ ప్రయత్నలే చేస్తోంది. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన వంటి ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఏపీలో నెట్టుకురావడం కష్టతరమే. అందుకే జనసేనతో కలిసి బలం పెంచుకునే పనిలో ఉంది. కానీ బీజేపీతో జనసేన పొత్తు ఎంతవరకు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకమే.. ఈ నేపథ్యంలో సొంతంగా బలం పెంచుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే అధికార వైసీపీ పై విమర్శలు గుప్పించడం, టీడీపీ విధానాలను ఎండగట్టడం వంటివి చేస్తూ ప్రజల దృష్టిని తిప్పుకునే పనిలో ఉంది కమలం పార్టీ.
ఇదిలా ఉంచితే ఏపీని పస్తుతం వెంటాడుతున్న సమస్యలలో రాజధాని అంశం కూడా ఒకటి. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతి కాదని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ స్టాండ్ తీసుకుంది. ఆ దిశగానే ముందుకు సాగుతోంది. అయితే ఈ త్రీ క్యాపిటల్స్ విధానంపై అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. తాము అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నామని టీడీపీ, జనసేన మరియు లెఫ్ట్ పార్టీలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అమరావతికే తమ మద్దతు అని చాలా సార్లు ప్రకటించారు. కాగా కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి మాత్రం విశాఖనే రాజధాని అనే విఢంగా వ్యాఖ్యానిచడంతో.. అసలు ఏపీ రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది.
మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చి ఇప్పుడు వైజాగ్ మాత్రమే రాజధాని అనే విఢంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీనికి కిషన్ రెడ్డి కూడా వత్తాసు పలికినట్లు కావడంతో కమలం పార్టీలో కలవరం మొదలైందట. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతనూ అనుకూలంగా మార్చుకునేందుకు మొదటినుంచి కూడా అమరావతికే జై కొట్టారు కమలనాథులు. అనూహ్యంగా కిషన్ రెడ్డి విశాఖా రాజధానిని మద్దతుగా వ్యవహరించడంతో ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తో ముందుకు సాగాలి అనేదానిపై కమలనాథులు తర్జనబర్జన పడుతున్నారట. అయితే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమ పార్టీ పరంగానే ఆయన వ్యాఖ్యానించరా అనేది కూడా చర్చనీయాంశమే. మొత్తానికి రాజధాని విషయంలో కిషన్ రెడ్డి పెట్టిన మంట కమలం పార్టీలో గుబులు పుట్టిస్తోందని కొందరి అభిప్రాయం.
ఇవి కూడా చదవండి…
ఉద్యమకారులకే ఎమ్మెల్సీల పట్టం…
ఎంపీ కోమటిరెడ్డి పై కేసు నమోదు
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనిద్దామా?