పొత్తు కన్ఫర్మ్.. అసలు అమస్య అక్కడే?

39
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మద్య పొత్తు అంశం ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తూ ఉంటుంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండు పార్టీల అధినేతలు కూడా అప్పుడప్పుడు హింట్ ఇస్తూనే ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ చేయడం లేదు. దీనికి మెయిన్ రీజన్ బీజేపీ వ్యవహారమే. టీడీపీ, జనసేన పార్టీలతో పాటు బీజేపీ కూడా కలిస్తే వైసీపీని ఎదుర్కోవడం సులభమని పవన్, చంద్రబాబు భావిస్తూ వచ్చారు. కానీ టీడీపీతో కలవడంపై బీజేపీ సందిగ్ధత వ్యక్తం చేస్తూ వచ్చింది. కానీ పవన్ చొరవతో బీజేపీ టీడీపీతో కలవడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

తాజాగా ఎన్డీయే మిత్రా పక్షల కూటమికి హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే మూడు పార్టీల మద్య పొత్తు ఖాయమే అని స్పష్టమౌతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీ టీడీపీ మద్య సమన్వయ లోపం ఉందని అందుకే పొత్తు విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడుతోందని, త్వరలో అన్నీ సమస్యలు పరిష్కరించబడి పొత్తు ఒకే అవుతుందని చెప్పుకొచ్చారు పవన్. దీంతో ఏపీలో 2014 కూటమి రిపీట్ కావడం పక్కా అని తేలిపోయింది. కాగా గత ఎన్నికల ముందు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ పై మోడి పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ తరువాత నుంచి టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఆ పార్టీతో కలవడానికి వెనుకడుగు వేస్తోంది. మరి పవన్ చెప్పినట్లుగా ఈ రెండు పార్టీల మద్య అండర్ స్టాండింగ్ ఏర్పడి పొత్తుకు ఎప్పుడు సిద్దమౌతాయో చూడాలి.

Also Read:BRS:మరోసారి మహారాష్ట్రకు కేసీఆర్

- Advertisement -