బీజేపీ వంకర బుద్ది.. మళ్ళీ తెరపైకి ?

64
- Advertisement -

దేశాధికారం తమ చేతిలో ఉందని అధికార దుర్వినియోగంతో కాషాయపార్టీ చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఆయా రాష్ట్రాలలో అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకొని దుర్మార్గపు పరిపాలనకు అద్దం పడుతోంది నేటి బీజేపీ అధిష్టానం. తమకు అనుకూలంగా ఉంటే సరేసరి. లేదంటే విపక్ష నేతలపై ఈడీ దాడులు, అక్రమ కేసులలో ఇరికించి ప్రశ్నించే గొంతులను నోక్కెయడం బీజేపీ అధిష్టానానికి అలవాటుగా మారింది. గతంలో ఏ ప్రభుత్వంలో లేనన్ని ఈడీ, సిబిఐ కేసులు బీజేపీ సర్కార్ లో నమోదు అయ్యాయి. అవికూడా కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపైనే. .

ఈ ఎనిమిదేళ్ళలో దాదాపు మూడువేల కేసులను ప్రతిపక్ష నేతలపై నమోదు చేసిందని అందులో కనీసం ముప్పై మందిపై కూడా కేసులను నిరూపించలేదని ఇటీవల పార్లమెంట్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రతిపక్ష నేతలపై బీజేపీ అధిష్టానం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందనే విషయం. ఇక తెలంగాణ విషయానికొస్తే బి‌ఆర్‌ఎస్ అధినేత సి‌ఎం కే‌సి‌ఆర్ ను టార్గెట్ చేస్తూ.. రాష్ట్రంలో పార్టీ ని కుల్చేందుకు విశ్వ ప్రయతంలే చేస్తోంది. అయితే మోడి అమిత్ షా కుయుక్తులను కే‌సి‌ఆర్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. ఆ మద్య బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కైంది బీజేపీ అధిష్టానం. అయినప్పటికి కుక్క తోక వంకర అన్నట్లు బీజేపీ వంకర బుద్దిని మాత్రం మానుకోవడం లేదు.

ఇటీవల డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇరికించేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మూలకు పడిన బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్ళీ తెరపైకి తెచ్చి బి‌ఆర్‌ఎస్ నేతలను ఇరకాటంలో పెట్టేందుకు చూస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి షాక్ ఇచ్చి బి‌ఆర్‌ఎస్ కు విధేయత చూపిన తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇటీవల ఈడీ నోటీసులను జారీ చేసింది. బీజేపీ కుయుక్తులకు చెక్ పెట్టినందుకే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ అయ్యాయనే సంగతి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. కాగా నోటీసులు అందిన మాట నిజమేనని, అయితే ఎందునిమిత్తం నోటీసులు జారీ చేశారనేది నోటీసులో వివరించలేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రశ్నించే గొంతులను కొక్కెస్తూ బీజేపీ చేస్తోన్న అక్రమ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పక తప్పదు.

ఇవి కూడా చదవండి…

టీటీడీ మండలి సభ్యుడిగా దాసరి కిరణ్

కోమటిరెడ్డి విత్ మోడీ..దేనికి చర్చ?

నడ్డా..తెలంగాణ మనసు గెలుచుకో..

- Advertisement -