వారికి ” నో సీట్ ” అంటున్న బీజేపీ !

48
- Advertisement -

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీజేపీలో చాలానే మార్పు కనిపిస్తోంది. అంతకు ముందు ఆకాశానికి నిచ్చెన వేసే విధంగా, అంతా మాదే అన్నట్లు గా వ్యవహరించిన కమలనాథులకు, కన్నడ ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో 100 పైగా సీట్లు సాధించిన బీజేపీ 2023 ఎన్నికలకు వచ్చే సరికి 66 సీట్లకు పడిపోయిందంటే.. ఆ పార్టీ కన్నడ ప్రజలు ఎంత ఘోర ఓటమిని కట్టబెట్టారో అర్థం చేసుకోవచ్చు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన వైఫల్యాన్ని సరిదిద్దుకొనే పనిలో ఉంది కాషాయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పార్లమెంట్ ఎన్నికలో రిపీట్ కాకూడదని పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

ఎన్నికలకు ఇంకా 10 నెలలకు సమయం ఉన్నప్పటికి.. ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది కాషాయ అధిష్టానం. కర్నాటకలో 28 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో 25 ఎంపీ సీట్లను గత ఎన్నికల్లో బీజేపీనే గెలుచుకుంది. ఈసారి క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. టార్గెట్ రిచ్ అవ్వాలంటే పక్కా వ్యూహంతో ముందుకు సాగాల్సిన పరిస్థితి. ఏ మాత్రం తేడా కొట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ కూడా మంచి జోరు మీద ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ను దాటుకొని 28 ఎంపీ సీట్లను క్లీన్ స్వీప్ చేయడం అనేది బీజేపీకి అంతా తేలికైన విషయం కాదు.

Also Read: ఆపరేషన్ ” ఘర్ వాపసి “.. ఫలిస్తుందా ?

అందుకే పక్కా ప్రణాళికతో ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది బీజేపీ. దీర్ఘకాలికంగా పార్టీలో కొనసాగుతూ, ప్రజాదరణ లేని వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాంటి వారికి టికెట్లు ఇవ్వకూడదని అధిష్టానం ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రజెంట్ ఎంపీలుగా కొనసాగుతున్న వారిలో దాదాపు 13 మందికి ప్రజాదరణ లేదట. అంతే కాకుండా పార్టీ పరంగా కూడా వారు ఇన్ యాక్టివ్ గా ఉన్నట్లు సమాచారం. అందుకే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో వారిని పక్కన పెట్టి కొత్తవారికి ప్రజాదరణ మెండుగా ఉన్నవారికి టికెట్లు కేటాయించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. మరి ఒకవేళ ఇదే గనుక నిజం అయితే టికెట్లు దక్కని ప్రస్తుత ఎంపీల నుంచి తిరుగుబాటు ఏర్పడే అవకాశం ఉంది. మరి కాషాయ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

Also Read: బీజేపీకి ఆ భయం పట్టుకుందా ?

- Advertisement -