దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎప్పుడు లేని విధంగా ఈడీ రైడ్ లు జరుగుతున్నా సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలే టార్గెట్ గా ఈ దాడులు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాము. బీజేపీ అవినీతి పాలనను ప్రశ్నిస్తే.. వెంటనే వారిపై కేసులు మోపడం.. ఈడీ రైడ్ లు జరపడం వంటి చర్యలు బీజేపీ అక్రమ పరిపాలనకు నిదర్శనం. సాధారణంగా ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీ మద్య విమర్శలు ప్రతి విమర్శలు, వాదోపవాదాలు ఉండడం సర్వసాధారణం. అయితే అధికార బీజేపీ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి బిన్నంగా జరుగుతోంది.
తమకు ఎదురే లేదన్నట్లుగా మోడీ అమిత్ షా ద్వయం వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజలను సైతం ఆందోళనకు గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు అనుకూలత ప్రదర్శించే నేతలపై అవినీతి ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. తమకు కాస్త వ్యతిరేకత చూపిన అవినీతి ఆరోపణలతో ఈడీ దాడులు నిర్వహించడం ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఈ గడిచిన ఎనిమిదేళ్ళలో దాదాపుగా మూడు వేల సార్లు ప్రతిపక్ష నేతలపై కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులు నిర్వహించిందట. ఇదే విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంట్ లో ప్రస్తావించారు. కేవలం ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే కలంకం అంటూ ఆయన పార్లమెంట్ లో ఘాటైన విమర్శలు చేశారు.
ఈ ఎనిమిదేళ్ళలో కేవలం ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా మూడు వేల సార్లు ఈడీ దాడులు నిర్వహించి కేవలం 23 మందిని మాత్రమే దొషులుగా తేల్చిందని, దీన్ని బట్టే మోడీ సర్కార్ కక్ష పూరిత రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని అప్ ఎంపీ సంజయ్ సింగ్ పార్లమెంట్ లో తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై ఇంత కఠినంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్.. దేశానికి 20 వేల కోట్లు మోసం చేసిన నిరావ్ మోడీ ని ఎందుకు పట్టుకోవడం లేదని, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, రెడ్డి బ్రదర్స్, యడ్యూరప్ప వంటి వారు చేసిన అవినీతి కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా ? అలాంటి అవినీతి పరులపై ఈడీ, సిబిఐ సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సంజయ్ సింగ్ ప్రశ్నించారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన బీజేపీ ఎంపీలు సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. ఏది ఏమైనప్పటికి మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న నియంత పరిపాలనకు ఇదే నిదర్శనం అనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
ఇవి కూడా చదవండి…