2019 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ పొత్తులో ఉన్న సంగతి విధితమే. ఆ తరువాత టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావడం.. మోడీ సర్కార్ పై చంద్రబాబు తీవ్ర విమర్శలతో విరుచుకుపడడంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2019 ఎన్నికలో టీడీపీ ఓడిపోయిన తరువాత బీజేపీ అసలు టీడీపీని పట్టించుకోవడమే మానేసింది. అయితే 2024 ఎన్నికల్లో సత్తా చాటలంటే బీజేపీతో కలవడం మంచిదని భావించిన చంద్రబాబు.. కాషాయ పార్టీతో కలిసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. ఆ పార్టీ పెద్దలు టీడీపీని దూరం పెడుతూనే వచ్చారు. చివరికి జనసేన మధ్యవర్తిత్వం చేసిన పెద్దగా ఫలితాలు కనిపించలేదు.
అయితే రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం కాబట్టి అనూహ్యంగా అమిత్ షా, నడ్డా వంటి వారితో ఆ మధ్య చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన కొద్ది రోజులకే ఏపీ వచ్చిన బీజేపీ పెద్దలు వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరిందనే వాదన ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అయితే జనసేనతో తమ పొత్తు ఉందని చెబుతున్న కమలనాథులు.. టీడీపీతో పొత్తు ఉందని చెప్పడంలో మాత్రం సంకోచిస్తున్నారు.
Also Read: CMKCR:జూన్ 30న పోడు పట్టాల పంపిణీ
ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ టీడీపీతో పొత్తు ఉంటుందని తాము ఎక్కడ చెప్పలేదని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే టీడీపీని బీజేపీ ఇంకా నమ్మట్లేదా అనే డౌట్ వినిపిస్తోంది. అయితే ఏపీలో బీజేపీకి ఒంటరిగా పోటీ చేసే బలం లేదనేది ఎవరు కదనలేని విషయం. అందుకే బలం కోసం జనసేన పార్టీతో పొత్తులో ఉన్న కాషాయ పార్టీ.. ఇంకా సత్తా చాటలంటే టీడీపీతో కూడా కలవాల్సిన పరిస్థితి. మరి చంద్రబాబు వల్ల గత ఎన్నికల టైమ్ లో ఎదుర్కొన్న పరిణామాలను పక్కన పెట్టి కాషాయ పార్టీ టీడీపీతో దోస్తీకి సై అంటుందా.. లేదా అనేది చూడాలి.
Also Read: విపక్షాలకు బిఆర్‌ఎస్ దూరం.. కారణం అదే !