ఆ రెండు పార్టీలలో గుబులు..?

42
- Advertisement -

తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్నా పరిణామాలు.. ఇతర రాష్ట్రాలను కూడా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలలో ప్రకంపనలు మొదలయ్యాయి. మహారాష్ట్రలో అజిత్ పవార్ కారణంగా ఎన్సీపీలో చీలిక తెచ్చిన బీజేపీ.. తమ పార్టీలను ముంచే అవకాశం ఉందని ఆయా పార్టీల అధినేతలలో భయం మొదలైందట. ముఖ్యంగా బిహార్ లోని జేడీయూ పార్టీకి ఈ గండం గట్టిగానే పొంచి ఉందనేది కొందరు విశ్లేషకులు చెబుతున్నా మాట. గత ఎన్నికల టైమ్ లో బీజేపీ కుతంత్రలను గ్రహించిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ అనూహ్యంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆర్జేడితో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించారు. అయితే అప్పటి నుంచే బీజేపీ వ్యూహాలు జేడీయూ ను కలవరపెడుతూనే ఉన్నాయి.

Also Read:బీజేపీలో సంచలన మార్పులకు కారణం అదే.. !

ఇక ఇటీవల బీజేపీ వ్యవహార కమిటీ చైర్మెన్ అరవింద్ సుంగ్ మాట్లాడుతూ..జేడీయూ లోని చాలమంది ఎమ్మేల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు. దీంతో ఏ క్షణంలోనైనా మహారాష్ట్ర తరహా రాజకీయాలు బిహార్ లో రిపీట్ కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఇదే భయం ఇప్పుడు కర్నాటక జేడీ ( ఎస్ ) పార్టీని కూడా వేధిస్తోందట. అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చినట్లుగా జేడీ ( ఎస్ ) ను కూడా చీల్చడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని జెడిఎస్ అధినేత హెచ్ డి. కుమారస్వామి తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీని చిల్చేందుకు ప్రయత్నిస్తున్న వారి పేర్లు ప్రస్తావించడం తనకిష్టం లేదని చెప్పిన కుమారస్వామి ఏ సమయంలో ఏదైనా జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో లేదా పార్లమెంట్ ఎన్నికల తరువాతనైనా చీలిక ఉండే అవకాశం ఉందని స్వయంగా కుమార స్వామే చెప్పడం గమనార్హం. మొత్తానికి బీజేపీ కుతంత్ర వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read:తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి

- Advertisement -