మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ కుదుపుకు అన్నీ రాజకీయ పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఎన్సీపీలో అధ్యక్షుడి తరువాతి స్థానంలో ఉన్న అజిత్ పవార్ ఊహించని విధంగా 29 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆ పార్టీకి షాక్ ఇస్తూ శివసేన షిండే వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఈ హటాత్పరినామంకు ఎన్సీపీ కుదేలైంది. అయితే ఇలా ఎన్సీపీని దెబ్బతీయడంలో బీజేపీ హస్తం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. గతంలో శివసేన పార్టీని కూడా ఇలాగే నిర్వీర్యం చేసిన కమలం పెద్దలు ఇప్పుడు మరో పెద్ద పార్టీ అయిన ఎన్సీపీని కూడా అలాగే చేయడంతో ఇతర పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తరువాత కాంగ్రెస్ పార్టీ బలం కూడా గట్టిగానే ఉంది. దాంతో నెక్స్ట్ కాంగ్రెస్ టార్గెట్ అవుతుందనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోందట..
Also Read:తెలంగాణకు కిషన్ రెడ్డి..ఏపీకి పురందేశ్వరి
ఎందుకంటే శివసేన, ఎన్సీపీ లను నిర్వీర్యం చేసి ఆధిక్యం ప్రదర్శిస్తున్న భాజపా.. కాంగ్రెస్ ను కూడా ఇదే విధంగా దెబ్బ తీస్తే మహారాష్ట్రలో తిరుగుండదనే ఉద్దేశంలో కమలం పార్టీ పెద్దలు ఉండే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం బీజేపీ ప్లాన్స్ విషయంలో అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోని ఎమ్మేల్యేలు ఎవరు బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఎవరైనా అసంతృప్త నేతలు ఉన్నారా అనే దానిపై కూడా సర్చింగ్ మొదలు పెట్టిందట. ఒకవేళ అసంతృప్త ఎమ్మేల్యేలు ఉంటే వారికి సరైన విధంగా బుజ్జగింపు చర్యలు చేపట్టి.. పక్కా చూపులు చూడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికోసం నేడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు తగు సూచనలు చేసి ఎవరు జంప్ అవ్వకుండా చర్యలు తీసుకోనుందట. మరి బీజేపీ కుతంత్రలు కాంగ్రెస్ ను కూడా దెబ్బ తీస్తాయేమో చూడాలి.
Also Read:Gutha:కాంగ్రెస్‌వి పచ్చి అబద్దాలు