కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా కలకలం..

25

కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపుతోంది. 50 మంది వైద్య విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మందికి, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులంతా జీజీహెచ్ పెయింగ్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించిన వైద్య సిబ్బంది వాటిని ల్యాబ్‌కు పంపామని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎన్ జిక్కి వెల్లడించారు.కరోనా బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్స్ గుర్తించి వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తామని ఆమె తెలిపారు.