ప‌వ‌న్‌కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్!

34
pawan kalyan
- Advertisement -

ఏపీలో రాజ‌కీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌ను ద‌గ్గ‌ర చేసుకునేందుకు టీడీపీ, బీజేపీ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.

పవన్ నే…. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

సర్కార్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పవన్ టీడీపీతో కలిసి వెళితేనే అది సాధ్యమవుతుందని అంతా భావిస్తున్న త‌రుణంలో ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ ను వదులుకునేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు.

అందుకే పవన్ ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించనుంద‌ట‌. జూన్ 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లోనే పవన్ ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

- Advertisement -