ఇండ‌స్ట్రీపై సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

35
suman
- Advertisement -

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీపై హీరో సుమ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇండస్ట్రీలో ఎవ్వరూ హ్యాపీగా లేరని ముఖ్యంగా బయ్యర్స్ గురించి పట్టించుకోవట్లేదని తెలిపారు. దాస‌రి వ‌ర్ధంతి సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడిన సుమ‌న్… దాసరి ఇండస్ట్రీ పెద్దగా అందరి సమస్యల గురించి ఆలోచించేవారు. ముఖ్యంగా ఆయన బయ్యర్స్‌ గురించి ఎక్కువగా ఆలోచించేవార‌ని చెప్పారు.

కోట్లకు కోట్లు పెట్టి మేక‌ర్స్ సినిమాలు తీస్తుంటే అవి హిట్ అవుతాయనే నమ్మకంతో బయ్యర్స్‌ కొంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే నష్టపోయేది వారేన‌ని తెలిపారు.

అసలు బయ్యర్ల గురించి ఆలోచించే వారే లేరని తెలిపారు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు లేద‌ని…నిర్మాత‌ల‌కు న‌టులు భారంగా మారార‌న్నారు. ఇక ఇప్పుడు సుమ‌న్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మార‌గా మిగితా వారు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..

- Advertisement -