కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై ట్రోల్స్

182
- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేతల నోటి వెంట భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఒకలా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నాడు. యాదాద్రి లక్ష్మినరసింహా స్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం మునుగోడు నుంచి కార్యకర్తలతో కలిసి యాదాద్రి చేరుకున్న బండి సంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని లక్ష్మీనర్సింహ స్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.

అయితే కిషన్ రెడ్డి మరోలా స్పందించారు. ఎమ్మెల్యేలను చేరమనడంలో తప్పేముందని అన్నారు. ఇది పెద్ద విషయం ఏమి కాదని ప్రైవేట్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరి మాటలపై నెటిజన్ల ట్రోల్ చేస్తున్నారు. రెండు వీడియోలు కలిపి వాళ్లకు వాళ్లకు క్లారిటీ లేదని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆ దొంగలకు వేరే పని తెలీదు:ప్రకాశ్‌రాజ్‌

ఫిబ్రవరిలో డిగ్రీ,పీజీ పరీక్షల నిర్వహణ

తెలంగాణ హరితహారం అందరికీ ఆదర్శం

- Advertisement -