ఏపీ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ న్యాయవది అయిన బిశ్వభూషణ్ జనసంఘ్,జనతా పార్టీలో పనిచేశారు.
1934 లో జన్మించిన ఆయన . 1980 నుంచి 1988 వరకు ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఒడియాలో ఆయన పలు గ్రంథాలు రాశారు. మారుబటాస్, రాణా ప్రతాప్, శేషజలక్, అస్తశిఖ, మానసి గ్రంథాలను రాయన రాశారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన బిశ్వభూషణ్ చిలికా, భువనేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించారు. 2004లో బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్ఎల్ నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. గత కొంతకాలంగా ఏపీకి కొత్త గవర్నర్ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒకానొక సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నియమించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఎవరు ఉహించని విధంగా బిశ్వ భూషణ్ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.