మితవాది బిపిన్ చంద్రపాల్ వర్థంతి

79
- Advertisement -

భారత స్వాతంత్ర సంగ్రామంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన వ్యక్తులలో బిపిన్ చంద్ర పాల్ ఒకరు. ఈయన 1858 నవంబర్7న సిల్హెట్‌లో జన్మించారు. లాల్‌ బాల్ పాల్ ముగ్గురిలో ఒకరిగా ప్రసిద్ధిచెందారు. ఈయన ఉపాధ్యాయుడు, పాత్రికేయుడు, రచయిత, వక్తగా భారత స్వాతంత్ర్యంలో తన ప్రభావం చేత పాల్గొన్నారు. కాగా నేడు బిపిన్ చంద్ర పాల్‌ వర్థంతి. భారత జాతీయ కాంగ్రెస్‌లో మితవాదిగా పరిగణించబడినప్పటికి జాతీయ వాద రాజకీయా నాయకులలో ఒకరిగా నిలిచారు.

Also Read: KARNATAKA:నేడే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం

1905 బెంగాల్ విభజనలో బ్రిటీష్‌ వలస విధానానికి వ్యతిరేకంగా పోరాడారు. అలాగే ఈయన వందేమాతరం అనే పత్రిక వ్యవస్థాపకుడు. బిపిన్ చంద్ర పాల్ మహాత్మాగాంధీ వ్యక్తి ఆరాధనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్లలో ఒకరిగా ఉన్నారు. ఈయన 1920 తర్వాత జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ బెంగాలీ పత్రికలకు తన సహకారం అందించారు. 1932 మే 20న కోల్‌కతాలో బిపిన్ చంద్ర పాల్ మరణించారు. తన జీవితం మొత్తం దేశ సేవకై పోరాడిన మితవాది.

Also Read: MODI:విశ్వ శాంతి స్థాపకుడు మన గాంధీ

- Advertisement -