వెండితెరపై ‘కత్తి’ కాంతారావు బయోపిక్..

1374
kathi kantha rao
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్,వైఎస్సార్ బయోపిక్‌ తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తుండగా క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న వైఎస్ బయోపిక్‌కి యాత్ర అనే టైటిల్‌ ఖరారు చేశారు.

తాజాగా మరో బయోపిక్ రాబోతుంది. ఎన్టీఆర్,ఏఎన్‌ఆర్‌లతో సమానంగా వెలుగొందిన కత్తి వీరుడు కాంతారావు జీవిత చరిత్ర తెరపైకి రానుంది. చంద్రాదిత్య ఫిల్మ్‌ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు డాక్టర్‌ పి.సి.ఆదిత్య పేర్కొన్నారు.

కాంతారావు సినీ, వ్యక్తిగత విషయాలు నేటి తరానికి తెలిసేలా బయోపిక్‌ను ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. అగ్రహీరోల సరసన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కాంతారావు వందకు పైగా సినిమాల్లో నటించారు. అయితే తర్వాత ఆయనకు అవకాశాలు సన్నగిల్లి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు. చీకటి వెలుగుల సంగ్రామం – చిత్రసీమలో నీ పయనం- కాంతారావు నీ కీర్తికి అంతంలేదు అనే సాంగ్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -