2002నాటి గోద్రా ఆల్లర్ల సమయంలో బిల్కిస్ బానో కుటుంబంపై అత్యంత దారుణంగా హింసించి రేప్ చేసిన వారిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని బిల్కిస్ సవాళ్లు చేసి సుప్రీంకోర్ట్‌లో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందుకు వచ్చినట్టు బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిల్కిస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గోద్రా ఆల్లర్ల సమయంలో బిల్కిస్ బానో ను సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. అయితే గుజరాత్ ప్రభుత్వం 1992 నాటి రెమిషన్ పాలసీ ద్వారా దోషులను విడుదల చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన వారికి మిఠాయిలు తినిపిస్తూ, పూలదండలతో ఘనంగా స్వాగతం పలకడంతో దేశవ్యాప్తంగా సర్వత్ర విమర్శలకు దారితీసింది. దోషుల విడుదలను రాజకీయ పార్టీలతో పాటు అనేక సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
ఇవి కూడా చదవండి….