బిహార్ రెండో విడత పోలింగ్…అప్ డేట్స్

161
bihar polling
- Advertisement -

బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 17 జిల్లాల్లో 94 స్ధానాలకు ఎన్నికలు జరగనుండగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.

ఇక రెండో విడతలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(రాఘోపుర్‌), ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ (హసన్‌పుర్‌),బీజేపీ నేత నంద్‌ కిశోర్‌ యాదవ్‌(పట్నా సాహెబ్‌), బీజేపీ నేత రాణా రణ్‌ ధీర్‌ సింగ్ (మధుబన్‌), జేడీయూ నేత శ్రవణ్‌కుమార్‌ (నలంద), జేడీయూ నేత రామ్‌సేవక్‌ సింగ్‌ (హథువా) కీలక నేతలు బరిలో ఉన్నారు.

అక్టోబర్‌ 28న తొలి విడతలో 71 స్థానాలకు 53.4శాతం పోలింగ్‌ నమోదైంది. నవంబరు 7న మూడో విడత పోలింగ్ జరగనుండగా ఈ నెల 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.

- Advertisement -