ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్..

200
dubbaka
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 315 కేంద్రాల్లో 89 సమస్యాత్మకం ఉండగా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు కరోనా పేషంట్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. పోలింగ్ నేపథ్యంలో 2 వేల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

మొత్తం ఓటర్ల సంఖ్య 1,98, 807 కాగా వీరిలో మహిళలు ఒక 1,00,779 మంది కాగా పురుషులు 98,0 28 మంది ఉన్నారు. కరోనా ప్రోటోకాల్ లో భాగంగా.. సీనియర్ సిటిజన్లకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సోషల్ డిస్టెన్స్ నిబంధన పాటిస్తామని, ఏఎన్ఎమ్ అందుబాటులో ఉంటారని, గ్లౌజులు ఇస్తామని తెలిపారు.

కోవిడ్‌ కారణంగా పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచారు అధికారులు. మాస్క్‌ లేకుండా ఓటు వేయడానికి ఎవరినీ అనుమతించరు. పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి శానిటైజర్ కూడా అందిస్తున్నారు.

- Advertisement -