బీహార్‌లో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత కృష్ణ అల్లవరూ బీహార్ ఎన్నికల కోసం మహాఘటబంధన్ (గ్రాండ్ అలయన్స్) యొక్క ప్రధాన హామీలను ప్రకటించారు. పాట్నాలో అధికారిక మేనిఫెస్టో విడుదలకు ముందే, కాంగ్రెస్ నేత కృష్ణ అల్లవరూ బీహార్ ప్రజల కోసం మహాఘటబంధన్ ప్రధాన హామీలను ప్రకటించారు.
ఈ మేనిఫెస్టోలో ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, విద్య, రైతుల సంక్షేమం వంటి కీలక అంశాలపై దృష్టి సారించామని వెల్లడించారు. ఇక మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన 27 మంది నేతలపై ఆర్జేడీ ఆరు సంవత్సరాల పాటు బహిష్కరణ వేటు వేసింది. కొంతమంది నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం లేదా అధికారిక RJD అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అందుకే వారిపై వేటు వేశామని ఆర్జేడీ తెలిపింది.
కాంగ్రెస్ సీనియర్ నేత మరియు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్టోబర్ 29న బీహార్‌లో తన తొలి ఎన్నికల సభను నిర్వహించనున్నారు. ఆయన ముజఫ్ఫర్‌పూర్‌లోని సక్రా నియోజకవర్గం మరియు దర్భంగాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత మరియు మహాఘటబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ కూడా పాల్గొననుండగా వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ: నవంబర్ 6,రెండో దశ: నవంబర్ 11 పోలింగ్ జరగనుండగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:కాకినాడ పోర్టు..గ్రేట్ డేంజర్ సిగ్నల్

