బిహార్ ఎన్నికల వేళ కీలక హామీలను ప్రకటించారు మహాఘట్‌బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. రైతులకు సాగు కోసం ఉచిత విద్యుత్‌ను అందిస్తాము…. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు 55 పైసలు వసూలు చేస్తోంది, కానీ మేము దాన్ని పూర్తిగా రద్దు చేస్తాము అన్నారు.
తాము అధికారంలోకి వస్తే మహిళలకు ₹30,000 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తల్లులు, అక్కచెల్లెమ్మల డిమాండ్లను తీర్చడానికి మకర సంక్రాంతి (జనవరి 14) నాడు సంవత్సరానికి ₹30,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తాము అని ఆయన చెప్పారు.
పాడీ (వరి)పై కనీస మద్దతు ధర (MSP)కు అదనంగా ₹300, మరియు గోధుమకు క్వింటాల్‌కు ₹400 చొప్పున అదనంగా ఇస్తాము అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ గెలిస్తే, PACS మరియు వ్యాపార మండళ్ల (Vyapar Mandal) అధ్యక్షులకు ప్రజాప్రతినిధుల హోదా ఇస్తాం అని తేజస్వి ప్రకటించారు.
రాష్ట్రంలో నమోదైన 8,400 వ్యాపార మండళ్ల మరియు PACS మేనేజర్లకు గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అని ప్రకటించారు. మొత్తం 243 స్థానాల బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ: నవంబర్ 6,రెండవ దశ: నవంబర్ 11న జరగనుండగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Also Read:AQI:కాలుష్య కోరల్లో ఢిల్లీ..

