సీఎం నితీశ్‌కు కరోనా

57
nithish
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ,47,512 యాక్టివ్ కేసులుండగా 1 5,26,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికే పలువురు కరోనా బారిన పడగా తాజాగా బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.

గ‌త నాలుగు రోజుల నుంచి జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఆయ‌న అధికార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంలేదు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్ర‌ప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మాల‌కు కూడా నితీశ్ హాజ‌రుకాలేక‌పోయారు. ఇటీవలె తమిళనాడు సీఎం స్టాలిన్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 202.5కోట్ల డోసులు పంపిణీ చేయగా ప్రస్తుతం దేశంలో ఫ్రీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.

- Advertisement -