దేశ చరిత్రలో ఒకే ఒక్కడు సీఎం కేసీఆర్..

59
nithish
- Advertisement -

ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం కే చంద్రశేఖర్‌ రావు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్…నూతన తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు. కేసీఆర్ ఇక్కడకి వచ్చేందుకు సమయం కేటాయిచండం చాలా సంతోషకరం అన్నారు.

గాల్వన్ లోయ అమరవీరులకు రూ. 10 లక్షలు, హైదరాబాద్ దుర్ఘటనలో మరణించిన కార్మికులకు రూ 5 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం గొప్ప విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా సమయంలో బీహార్ వాసులను తరలించేందుకు ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేయడం వారి ఉదారతకు తార్కాణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచిన కార్యాచరణను మరే ప్రభుత్వం చేయలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ 2001 నుంచి ఉద్యమించారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, వికాసంలో కేసీఆర్ భాగస్వామ్యం ఎంతో గొప్పది అని కొనియాడారు. మిషన్ భగీరథ పథకం గొప్ప పథకం. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణలోని గ్రామ గ్రామానికి మంచినీటిని అందించడం చాలా గొప్ప కార్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రేరణతో బీహార్ లో నీటి సమస్యను త్వరలోనే అధిగమిస్తాం అన్నారు. ఎప్పటిదాకా వ్యవసాయోగ్యమైన భూమి, పచ్చదనం ఉంటుందో అప్పుడే సమాజం వర్ధిల్లుతుందని… ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి కోసం అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ కే సాధ్యమైందన్నారు.

- Advertisement -