అమర సైనికుల త్యాగం గొప్పది: సీఎం కేసీఆర్

57
cm kcr
- Advertisement -

గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని సీఎం కే చంద్రశేఖర్‌ రావు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌ రావు ప్రసంగిస్తూ.. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించి పోతుందన్నారు. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బిహార్‌తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని చెప్పారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణా వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ బంధువులు ఎంతో మంది ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. తెలంగాణకు వస్తున్న వలస కూలీలను తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -