తెలంగాణకు మరో భారీ పెట్టుబ‌డి.. కేటీఆర్ హ‌ర్షం..

18
ktr

తెలంగాణలో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. తాజాగా హైద‌రాబాద్‌లో గ్లోబ‌ల్ కేప‌బిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మాస్ మ్యూచువ‌ల్ సంస్థ ప్ర‌క‌టించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది. మాస్ మ్యూచువ‌ల్ కంపెనీ పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంది? టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒక‌టైన మాస్ మ్యూచువ‌ల్‌ను రాష్ర్టంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆహ్వానించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, ఫియ‌ట్ క్రిస్ల‌ర్ సంస్థలు పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.