నాగచైతన్య ‘లవ్‌ స్టోరి’కి ముహుర్తం ఫిక్స్‌..

24
Naga Chaitanya

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మించారు. ప‌వ‌న్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. ప్రేక్షకులకు ‘లవ్‌ స్టోరి’ని చూపించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చాం. ఆ శుభ తరుణం రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న థియేటర్లలో కలుద్దాం’’ అని చెప్పారు.

ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.