బిగ్ బాస్ 5…అఫిషియల్ అనౌన్స్‌మెంట్

163
bigg boss
- Advertisement -

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5కి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 5న సీజన్ 5 ప్రారంభంకానుందని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు నిర్వాహకులు. ఈసారి కూడా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండగా ప్రతీ రోజు సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 10గం.ల‌కు ఈ షో ప్ర‌సారం కానుండ‌గా, శ‌ని,ఆదివారాల‌లో 9గం.ల‌కు మొద‌లు కానుంది.

ఇప్పటికే కంటెస్టెంట్స్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. క్వారంటైన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేసి వారిని హౌస్‌లోకి పంపించనున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్‌ హౌస్‌లో యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి తదితరులు ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -