ఏదైనా జరగొచ్చు అంటూ రియాల్టీ షో బిగ్ బాస్ 2పై ప్రేక్షకులకు ఆసక్తి పెంచేలా చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. బుల్లితెర టెలివిజన్ చరిత్రలో మరోసారి అదిరిపోచే టీఆర్పీతో దూసుకుపోతోంది బిగ్ బాస్ 2. షో ప్రారంభంరోజున 15.1 టీఆర్పీని సాధించింది. తెలంగాణ,ఏపీ రాష్ట్రాల్లోని ప్రతి ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ లాంచ్ షోని చూశారని ‘మా’ అఫిషియల్‌గా వెల్లడించింది. అంతేగాదు తొలివారంలో 60 శాతం మంది తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ షోని చూశారని చెప్పుకొచ్చింది. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలిసీజన్ ఓపెనింగ్ రోజు 16.18 రికార్డును మాత్రం దాటలేకపోయాడు నాని.
అంతేగాదు ఇప్పటివరకు 11 ఎపిసోడ్లు పూర్తికాగా అప్పుడే బిగ్ హౌస్‌లో కాంట్రవర్సీ,ఎలిమినేషన్ కూడా మొదలైంది. సామాన్యుల కేటగిరిలో ఎంట్రీ ఇచ్చిన మాడల్ సంజన ఎలిమినేట్ కాగా ఆమె స్ధానంలో హీరోయిన్ నందిని ఎంట్రీ ఇచ్చింది.
ఇక గత సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం బిగ్ హౌజ్‌లోకి వెళ్లే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. ఈ క్రమంలో 12వ ఎపిసోడ్లో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ‘జంబలకిడి పంబ’ నటీనటులు శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరు హౌజ్‌లో ఫుల్ ఫన్ని జనరేట్ చేశారు.
సినిమాలో అమ్మాయిలు అబ్బాయిలుగా,అబ్బాయిలు అమ్మాయిలుగా నటిస్తారని ఆ క్యారెక్టర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి బయటకు రావడం లేదని వెన్నెల కిషోర్ చెప్పారు. అయితే శ్రీనివాసరెడ్డి ఎంట్రీతో అదరగొట్టాడు. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు. కంటెస్టెంట్స్,శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ మధ్య ఆసక్తికర చర్చ నడుస్తుండగా టైం ముగియడంతో వారు బిగ్ హౌస్నుంచి బయటకువచ్చారు.