బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 3 హైలైట్స్

192
gangavva
- Advertisement -

బుల్లితెర రియాల్టిషో బిగ్ బాస్ మంగళవారంతో మూడో ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. తొలివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారి సందడితో షో మూడోఎపిసోడ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది.ఎపిసోడ్ ప్రారంభంలో సీక్రెట్ రూంలో ఉన్న అరియానా, సొహైల్‌లు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఫోన్ చేసి ఆర్డర్లు చేసి కంటెస్టెంట్లను ఆటపట్టించే ప్రయత్నం చేశారు…తమకు కావాల్సిన మెను గురించి అడుగుతూ ఇంటి సభ్యులను అడుగుతూ ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించగా అఖిల్ తర్వాత నోయల్ వారికి పంచ్‌లేశారు. చివరగా నోయల్ వారితో ఫోన్‌లో పంచ్‌లేస్తూ సడన్‌గా ఫోన్ కట్ చేశారు.

తర్వాత హౌస్‌లో ఉన్నవాళ్లలోనే కట్టప్ప ఎవరనుకుంటున్నారని సభ్యులను సీక్రెట్‌గా ఓ చిట్టిరూపంలో రాసి చెప్పాలని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఒక్కోసభ్యులు తమకు నచ్చిన పేర్లు రాసి బాక్స్‌లో వేయగా వీరిలో అఖిల్, సూర్యకిరణ్‌ పేర్లను ఎక్కువమంది రాశారు. సభ్యులందరూ రాయడం పూర్తికాగానే బయట నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ పేర్లు ఉంచిన బాక్స్‌ని తీసుకుని వెళ్లిపోయారు.

ఇక కరాటే కళ్యాణ్ హౌస్ మేట్స్ ముందు కూర్చుని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ చిరాకు తెప్పించింది. నాకు తెలియనిది నేర్చుకుంటా..గంగవ్వ కట్టుకున్నట్టు చీర కట్టుకోవడం నేర్చుకుంటా అని చెప్పింది కళ్యాణి. దీంతో అభిజిత్ మీరు ఆమెలా కాని చీర కట్టుకోకండి చూడలేక చస్తాం అని అనడంతో కరాటే కళ్యాణి నోటికి పనిచెప్పింది.

నేను మరీ అంత చచ్చిపోయేలా ఉండను.. నాకూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ రచ్చచేసింది. అంత దరిద్ర్యంగా ఉన్నానా.. మీ మనసులో నా గురించి ఏదో రన్ అవుతుంది అంటూ క్లాస్ పీకి ఇంకెప్పుడూ నువ్వు ఉన్నదగ్గరికి రాను అని చెప్పి వెళ్లిపోయింది. బాబోయ్.. నేను సరదాగా అన్నాను.. సారీ అండి.. వదిలేయండి అని అభిజిత్ తలపట్టుకున్న కల్యాణి వినిపించుకోలేదు. ఇక ఎపిసోడ్‌ 3లో రీజన్ ఏంటో ప్రేక్షకులకు తెలియకుండానే బోరున ఏడ్చేసింది మొనాల్.

ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరికి 1000 పాయింట్ల చొప్పున.. 14 మందికి 14 వేల పాయింట్లు ఇచ్చారు. తప్పులు చేస్తే.. పాయింట్లు తగ్గుతూ వస్తాయని హెచ్చరించారు బిగ్ బాస్. తర్వాత లాస్యని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు.టాస్క్ బంధనల్ని చదివి వినిపించిన లాస్య…. ఈ టాస్క్‌కి సంచాలకురాలిగా యాంకర్ దేవిని, న్యాయ నిర్ణేతగా రాజ శేఖర్ మాస్టర్‌ని నియమించారు.ఇద్దరిద్దరుగా విడిపోయి బొమ్మను ఎక్స్‌ప్లైన్ చేసేవాళ్లు వాళ్లు ఒకరైతే.. బొమ్మ వేసేవాళ్లు ఒకరై పెయింటింగ్స్ వేశారు. అయితే గంగవ్వ తనకు రంగులు

చెప్పడం రాదని అందుకే సుజాతకి రంగులు చెప్పలేకపోయానని చెప్పింది. ఇక రెండు రోజులుగా సీక్రెట్ రూంలో ఉన్న అరియానా-సొహైలు‌‌లు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే టైం వచ్చిందని హౌస్‌లోకి పంపారు బిగ్ బాస్.ఇక టీచర్ అవతారం ఎత్తిన కరాటే కళ్యాణితో ఫుడ్ బాల్ ఆడేసింది గంగవ్వ. తెలుగులోనే మాట్లాడాలి.. మైక్ సరిగా ధరించాలి.. అంటూ కళ్యాణి క్లాస్‌లు పీకడం ప్రారంభించింది. దీంతో గంగవ్వ.. జీతాలు తీసుకుని ఫెయిల్ చేస్తావా?? పిచ్చాసుపత్రిలో పేషెంట్ లెక్క చేస్తున్నావ్ అని కరాటే కళ్యాణిని ఫుడ్ బాల్ ఆడింది గంగవ్వ.

ఇంటి సభ్యులకు తన అనుభవాన్ని తెలియజేసింది గంగవ్వ. ఊరికే అనవసరంగా కొట్టుకోవడం దేనికి.. ఎన్నాళ్లు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అలాంటి దాని కోసం ఎందుకు తిట్టికోవడం తిట్టుకోవడం అని హితబోధ చేసింది. ఇక హౌస్‌లోకి వచ్చిన తరువాత అరియానా-సొహైల్‌లు రెచ్చిపోవడం అభిజిత్ గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో గొడవ కొట్టుకునే వరకు వెళ్లగా ఎపిసోడ్‌కు బ్రేక్‌ పడింది.

- Advertisement -