నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్…

217
TS EAMCET 2020
- Advertisement -

తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణలో చాలా మార్పులు ఉన్నాయి.. తెలంగాణలో సెప్టెంబర్ 9, 10, 11, 14, 28, 29 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష వేళల్లో మార్పులు ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్‌నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్‌నూన్ సెషన్ ఎగ్జామ్స్ ఉంటాయి.

విద్యార్థులు పరీక్ష కేంద్రం దగ్గర సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి. పరీక్ష కేంద్రం దగ్గర ఎంట్రీ పాయింట్స్‌లో గీసిన సర్కిల్స్‌లో నిల్చోవాలి. దగ్గు, జలుబు, తుమ్ములు, జ్వరం లాంటి సమస్యలు ఉంటే ఎగ్జామ్ సెంటర్‌లో అధికారులకు సమాచారం ఇవ్వాలి. విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఫ్లెక్సిబుల్ గ్లౌజులు, 50ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్, ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.ఎంట్రెన్స్ దగ్గర విద్యార్థుల టెంపరేచర్ చెక్ చేస్తారు. హాల్ టికెట్, ఐడీ, డిక్లరేషన్ ఫామ్ వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పరీక్ష గది ఎక్కడుందో తెలుపుతారు.

పరీక్షకు వెళ్లే ముందు విద్యార్థులు డిక్లరేషన్ ఫామ్ తీసుకెళ్లాలి. ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంటేనే పరీక్ష కేంద్రంలోకి రానిస్తారు. డిక్లరేషన్ ఫామ్‌ను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‍లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన గైడ్‌లైన్స్ రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఎంసెట్ నిర్వహించే జేఎన్‌టీయూ హైదరాబాద్ కూడా అవే గైడ్‌లైన్స్ పాటించనుంది.

రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర శానిటైజర్ ఉంటుంది. ఉపయోగించాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఫోటోగ్రాఫ్ తీసుకుంటారు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని టెస్ట్ సెంటర్ల దగ్గర విద్యార్థులతో పాటు వచ్చే వారికి ఎలాంటి వెయింటింగ్ ప్లేస్ ఉండదు. విద్యార్థులు రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అందుకే పరీక్షా కేంద్రానికి ఇబ్బందులు లేకుండా చేరుకోవడానికి ఒకరోజు ముందే టెస్ట్ సెంటర్ ఎక్కడుందో వెళ్లి చూసి రావాలి.

- Advertisement -