బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ఆరంభం నుంచే అంచనాలను మించి అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. సాధారణంగా షో ప్రారంభంలో పోటీదారులు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొద్ది రోజులు సమయం తీసుకుంటారు. కానీ ఈసారి అలా కాకుండా, మొదటి రోజే హౌస్‌మేట్స్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు షురూ అయ్యాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లో అత్యంత కీలకమైన ‘వంటగది’ (కిచెన్) కేంద్రంగా ఈ యుద్దం మరింత ముదిరిపోయింది. ఎపిసోడ్స్, ప్రోమోలు చూస్తుంటే ఆట రోహిత్ మరియు త్రిగుణ్ చుట్టూనే తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం హౌస్‌లో పోటీదారులను బిగ్ బాస్ బ్లూ టీమ్, రెడ్ టీమ్‌లుగా విభజించారు. హౌస్‌మేట్స్ అయ్యేందుకు, ‘హై రిస్క్’ నుండి ‘నో రిస్క్’ జోన్‌కు వెళ్లేందుకు అందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో గృహ పనుల నిర్వహణలో పెద్ద రచ్చే జరిగింది. సుధీర్ వచ్చి కిచెన్ వర్క్స్ గురించి రోహిత్‌కి చెప్పగా, “నా డిపార్ట్‌మెంట్ అని ప్రతీసారి నేనే వచ్చి చూసుకోలేను కదా” అని రోహిత్ సమాధానమిచ్చాడు. అలాగే డిష్ వాషింగ్ వల్ల తన చేతులు పాడువుతున్నాయని అమన్ వద్ద రోహిత్ వాపోవడం కనిపించింది.
ఈ గందరగోళాన్ని గమనించిన బిగ్ బాస్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇంట్లో అందరూ పనులు చేయాల్సిన అవసరం లేదని, ఒక టీమ్ పూర్తిగా పనులు చేస్తే, మరొక టీమ్ వాటిని కేవలం ‘మానిటర్’ (పర్యవేక్షణ) మాత్రమే చేయాలని ఆదేశించారు.
బిగ్ బాస్ ఆదేశాల తర్వాత చర్చల్లో మంటలు చెలరేగాయి. కిచెన్ టీమ్ గురించి చెబుతూ, అటువైపు నుంచి ‘జీరో హెల్ప్’ అని రోహిత్ కామెంట్ చేయడం వివాదానికి కారణమైంది. “నీకు ఇచ్చిన డిష్ వాషింగ్ డ్యూటీనే నువ్వు సరిగ్గా చేయలేదు, మమ్మల్ని జీరో అంటావా?” అని త్రిగుణ్, కృష్ణుడు తీవ్రంగా మండిపడ్డారు.
పనికొచ్చే పద్ధతి – పనికిరాని పద్ధతి: నాది పనికొచ్చే పద్ధతి, నీది పనికిరాని పద్ధతి” అంటూ త్రిగుణ్ వెటకారంగా మాట్లాడటమే కాకుండా, “మీదికి వస్తున్నావ్.. కొడతావా? కొట్టు చూద్దాం” అంటూ రోహిత్‌పైకి దూసుకెళ్లాడు.
రెడ్ టీమ్, బ్లూ టీమ్ పర్యవేక్షణ సమయంలో వర్షిణి, కృష్ణుడు, త్రిగుణ్ కలిసి రోహిత్ వైఖరిపై విమర్శలు గుప్పించారు. రోహిత్ తనని తాను ప్రొఫెసర్‌లా భావిస్తున్నాడని, మిగతావారిని వాడుకుని పైకి రావాలని చూస్తున్నాడని త్రిగుణ్ ఆరోపించాడు.
Also Read:గుండె ఆగితే..మెదడులో ఏం జరుగుతుంది?
మీరు స్క్రిప్ట్‌లు రాసుకుంటున్నారు” అని రోహిత్ కౌంటర్ ఇవ్వగా, “నిన్ను పెట్టుకుని స్క్రిప్ట్ రాసేంత బొమ్మ నీకు లేదు, పాయింట్‌కి రాకుండా స్క్రాప్ మాట్లాడకు” అంటూ త్రిగుణ్ మరింత ఘాటుగా సమాధానమిచ్చాడు.
ఇంట్లో ప్రతిసారి గొడవలకు నిలయంగా మారే వంటగది, ఈసారి మూడో రోజే యుద్ధక్షేత్రంగా మారింది. రోహిత్ వర్సెస్ త్రిగుణ్ మధ్య ప్రారంభమైన ఈ పోరు రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో, ఈ గొడవల వేడి ఎవరి ఎలిమినేషన్‌కు దారితీస్తుందో చూడాలి.

