Bigg Boss 8 Telugu: నబీల్ – ప్రేరణ మాటల యుద్ధం

0
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. వచ్చే వారం బిగ్ బాస్‌కు ఎండ్ కార్డు పడనుండగా తాజా ఎపిసోడ్‌లో మరో రెండు టాస్కులు పెట్టి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్. ఇది హౌస్‌లో ఉన్న వారి మధ్య మాటల యుద్దానికి దారి తీసింది.

తొలుత ‘పవర్ ఫ్లాగ్’ అనే టాస్కు పెట్టారు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లో గెలవాడనికి ముందుగా ఎవరైతే రెడ్ ఫ్లాగ్‌ని పట్టుకుంటారో వారు ఆ రౌండ్‌లో ఒకరిని రేసు నుంచి తప్పించొచ్చు. ఇక టాస్కు మొదలైన వెంటనే తొలి రౌండ్‌లో గౌతమ్ ఫ్లాగ్‌ని అందుకున్నాడు. దీంతో వెంటనే ప్రేరణను ఛాలెంజ్‌ నుంచి తప్పించాడు. ఆ తర్వాత మరోసారి గౌతమ్ చేతికే ఫ్లాగ్ దక్కింది. దీంతో ఈసారి నిఖిల్‌ని లేపేశాడు గౌతమ్.

ఇక మూడో రౌండ్‌లో రోహిణి పవర్ ఫ్లాగ్‌ని దక్కించుకుని గౌతమ్‌ని రేసు నుండి తప్పించింది . చివరికి అవినాష్-రోహిణి మిగలగా రోహిణి టాస్కులో గెలిచింది. ఆ తర్వాత నిలబెట్టు-పడగొట్టు అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. తర్వాత నబీల్-ప్రేరణ మధ్య సరదాగా మొదలైన డిస్కషన్ సీరియస్ అయింది. ఇద్దరూ ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. ఇందుకు సంబంధించిన ప్రొమో రిలీజ్ అయింది.

Also Read:బీఆర్ఎస్ పాలన..తెలంగాణ ప్రగతికి బాటలు

- Advertisement -