BB6..కొట్టుకున్న ఇంటి సభ్యులు

91
Revanth
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 46 రోజులు పూర్తి చేసుకుంది. 47వ ఎపిసోడ్‌లో భాగంగా శ్రీహాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించగా ఫిజికల్ టాస్క్‌లో కొట్టుకున్నారు ఇంటి సభ్యులు.

తొలుత శ్రీహన్ పుట్టిన రోజు కావడంతో ఇంటి సభ్యులంతా కలిసి కేక్ ని తయారు చేసి కట్ చేయించారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేయగా ఇంట్లో ఉండేందుకు పోటీ పడాలని కొత్త టాస్కులు ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఫుడ్ కోసం డివైడ్స్ చేసిన రెండు టీమ్స్ ని అలాగే ఉంచి మరో కొత్త టాస్క్ ఇచ్చారు.

ఒక మెషిన్ లో నుంచి బొమ్మలు, పూలు వస్తాయి. రెండు టీమ్స్ ఆ బొమ్మలు, పూలని కలెక్ట్ చేసి వారికి ఇచ్చిన ప్లేసెస్ లో పెట్టాలి. దీంతో రెండు టీమ్స్ మెషిన్ దగ్గరే ఉండి పోటీ పడ్డాయి. బొమ్మలు, పూలు వస్తుండగానే లాక్కోవడం మొదలుపెట్టగా ఇది కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. శ్రీహన్, అర్జున్ కళ్యాణ్ మధ్య గొడవ జరగడంతో అర్జున్ కళ్యాణ్.. శ్రీహాన్ ని మెషిన్ నుంచి లాగేశాడు, దీంతో శ్రీహన్ కూడా అలాగే చేయడంతో ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు.

శ్రీహాన్ నుంచి బొమ్మ లాక్కునే క్రమంలో శ్రీ సత్య కింద పడింది. దీంతో రెండు టీమ్స్ గొడవపడ్డాయి. రేవంత్ ఏం చేసినా శ్రీసత్య ఏదో ఒకటి అనడంతో రేవంత్ గట్టి గట్టిగా అరిచాడు.

- Advertisement -