బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజవయంతంగా 19 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో చివరివరకు శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. చివరకు ఎత్తర జెండా అనే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఇసుకని కాడికి ఓ వైపు ఖాళీ బాక్స్ లో పోస్తే, మరోవైపు ఉన్న జెండా పైకి లెగుస్తుంది. ఎవరి జెండా ముందు పైకి లెగిస్తే వారే కెప్టెన్ అని చెప్పడంతో ముగ్గురూ బాగానే పోటీ పడ్డారు. కానీ ఆదిరెడ్డి ఈజీగా ఈ టాస్క్ గెలిచి హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయ్యాడు.
కెప్టెన్సీ ఎన్నిక అనంతరం హౌస్ లో గంటసేపు ప్రసారమయ్యే షోలో ఎవరు ఎక్కువగా కనిపిస్తారని అనుకుంటున్నారని ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంట్లో ఎక్కువగా పదినిమిషాల పాటు తాను కనిపిస్తానని చెప్పి గీతూ ఈ టాస్క్ లో గెలిచింది. చివర్లో జీరో టైమింగ్ కోసం కీర్తి, ఆరోహి, అర్జున్ పోటీ పడ్డారు. కీర్తి జీరో టైమింగ్ లో ఉందని తెలుసుకొని బాధపడింది.
ఆ తర్వాత కంటెస్టెంట్స్ మాట్లాడుకోవడాలు చూపించాడు. ఇక గీతూ పది నిముషాలు కనిపిస్తున్నానని హడావిడి చేసింది. ఆ తర్వాత ఆరోహి, ఆర్జే సూర్య ఫుడ్ కోసం దొంగతనం చేసి చాటుగా వంట చేసుకొని తిన్నారు.