బిగ్ బాస్ 5 మొదలైంది.. 19 మంది కంటెస్టెంట్లు వీరే..

73
Nagarjuna

బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ మొదలైంది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశపెట్టారు. వీరిలో టీవీ నటులు, సినీ నటులు, యాంకర్లు, ఆర్జేలు, ఓ మోడలింగ్ ట్రైనర్ తదితరులు ఉన్నారు. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఒక్కొక్క కంటెస్టెంట్ ను ఆహ్వానించి వారిని బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈసారి బిగ్ బాస్ ఇంట్లో 70 కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఐదో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా యూ ట్యూబర్ సిరి హన్ముంతు వచ్చింది. వచ్చీ రాగానే క్రాక్ సినిమాలో ఐటం సాంగ్‌తో పిచ్చెక్కించింది సిరి. ఈమె తర్వాత రెండో కంటెస్టెంట్‌గా విజే సన్నీ వచ్చాడు. టీవీ సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై బాగా ఫేమస్ అయ్యాడు సన్నీ. మూడో కంటెస్టెంట్‌గా లహరి షారి వచ్చింది.. కంటెస్టెంట్ నెంబర్ 4గా సింగర్, ఇండియన్ ఐడల్ విజేత శ్రీ రామచంద్ర వచ్చాడు.. కంటెస్టెంట్ నెంబర్ 5గా అనీ మాస్టర్.. కంటెస్టెంట్ నెంబర్ 6గా కమెడియన్ లోబో వచ్చాడు.. కంటెస్టెంట్ నెంబర్ 7గా సీనియర్ నటి ప్రియ వచ్చింది.. కంటెస్టెంట్ నెంబర్ 8గా మోడల్ జస్వంత్ ఇంట్లోకి వచ్చాడు..కంటెస్టెంట్ నెంబర్ 9 జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక సింగ్..కంటెస్టెంట్ నెంబర్ 10గా షణ్ముఖ్ జస్వంత్ వచ్చాడు..కంటెస్టెంట్ నెంబర్ 11గా హమిద వచ్చింది..కంటెస్టెంట్ నెంబర్ 12 నటరాజ్ మాస్టర్..కంటెస్టెంట్ నెంబర్ 13గా యూ ట్యూబర్ 7ఆర్ట్స్ సరయు వచ్చింది..కంటెస్టెంట్ నెంబర్ 14న నటుడు విశ్వ వచ్చాడు..కంటెస్టెంట్ నెంబర్ 15గా కార్తీక దీపం ఉమాదేవి వచ్చింది..కంటెస్టెంట్ నెంబర్ 16గా మానస్ వచ్చాడు..కంటెస్టెంట్ నెంబర్ 17గా ఆర్జే కాజల్ వచ్చింది..కంటెస్టెంట్ నెంబర్ 18గా శ్వేతా వర్మ వచ్చింది..కంటెస్టెంట్ నెంబర్ 19గా యాంకర్ రవి ఎంట్రీ..