గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటుడు కళ్యాణ్..

72
Actor O Kalyan

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని మనుమరాళ్లు హైమి,అర్ణ లతో కలిసి మొక్కలు నాటారు సినీ నటుడు,నిర్మాత ఓ.కళ్యాణ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని.. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఓ.కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని ఓ కళ్యాణ్ కోరారు.