బిగ్ బాస్ 4..ప్రొమో రిలీజ్

337
nagarjuna
- Advertisement -

త్వరలో బిగ్ బాస్ సీజన్ ప్రారంభమవుతుందని స్టార్ మా అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4పై పుకార్లు షికార్ చేస్తున్నాయి.

అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమోను విడుదల చేసింది స్టార్ మా. ఈ ప్రోమోలో నాగార్జున వృద్ధుడి గెటప్ లో టెలిస్కోప్ లో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చూస్తున్నట్టు చూపించగా ఒక్కప్రోమోతో సీజన్ 4 పై ఆసక్తి పెంచేసింది.

బిగ్ బాస్4 షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున స్టార్ట్ చేసి.. 30 నుంచి రెగ్యులర్‌గా ఈ షోను ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్‌లుగా పాల్గొననుండగా 106 రోజుల పాటు ప్రొగ్రాం జరగనుంది.

- Advertisement -