బిగ్ బాస్ హౌస్ నుండి కొత్త హౌస్‌లోకి గంగవ్వ!

150
nagarjuna bb4

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే ముందు ఏం చెప్పిందో వెళ్లే ముందు అది సాధించుకోని బయటికి వచ్చింది గంగవ్వ. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న తన కోరికను నెరవేరుస్తానని నాగార్జున హామీ ఇవ్వడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌ నుండి బయటకు వచ్చిన గంగవ్వ త్వరలో కొత్త హౌస్‌లోకి అడుగుపెట్టబోతుంది.

బిగ్ బాస్ హౌస్‌లో 5 వారాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన గంగవ్వ…తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఇక్కడ ఉండలేకపోతున్నానని కన్నీటి పర్యంతమైంది. దీంతో ఆమె కోరికను మన్నించిన బిగ్ బాస్‌ ఆమెను ఇంటి నుండి పంపించేందుకు ఓకే చెప్పారు.

అయితే ఇంటి నుండి బయటకు వచ్చిన గంగవ్వకు గూడ్ న్యూస్ చెప్పారు. నువ్వు ఏ కోరికతో అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చావో ఆ కోరికను నెరవేర్చే బాధ్యత తనదని నీ కొత్త ఇంటి పనులు త్వరలో మొదలవుతాయని తెలిపారు నాగ్‌.

ఇళ్లు కట్టిన తరువాత దానికి తాళం కూడా వేసుకోవచ్చు..ఇప్పటిలా తాళ్లు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని తెలపగానే ఇంటి సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ నాగార్జునకు థ్యాంక్స్ చెప్పారు. మొత్తంగా తన కోరికను నెరవేర్చుకుని ఇంటికి వెళ్తున్న గంగవ్వకు అంతా బెస్ట్ విషెస్ తెలిపారు.