ఎట్టకేలకు చిక్కిన చిరుత…

328
chirutha

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కొంతకాలంగా కలకలం సృష్టించిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు ఆరు నెలలుగా శ్రమిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.

అయితే చిరుతను పట్టునేందుకు ఎరగా గొర్లు,ఆవు దూడలను ఉంచగా అధికారుల ప్రయత్నం ఫలించింది. రాజేంద్రనగర్‌లోని వాలంతరి వద్ద ఉద‌యం 4 గంట‌ల‌కు బోనులో చిక్కింది. శనివారం ఈ ప్రాంతంలో చిరుత సంతరించడంతో వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ వ‌ద్ద ఓ ప‌శువుల‌కొట్టంలో రెండు ఆవుదూడ‌ల‌ను చంపి తిన్న‌ది.

దీంతో పోలీసులు, అట‌వీశాక అధికారులు నిన్న చ‌నిపోయిన రెండు ఆవు దూడ‌ల‌ను అందులో ఎర‌గా ఉంచారు. దూడ‌ల‌కోసం వ‌చ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో ప్రజలు ఉపిరి పీల్చుకున్నారు.