బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 నేటితో ముగియనుంది. 103 రోజులు పూర్తి చేసుకున్న ఈసీజన్ 3 ఇవాళ ఫైనల్ జరుగనుంది. కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన 17మంది కంటెస్టెంట్లు నిన్న సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగే ఫినాలే కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ఫినాలె కు మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్లు సమాచారం. కాగా టాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రెటీలతో పాటు కంటెస్టెంట్లతో డ్యాన్స్ ప్రొగ్రాం నిర్వహించనున్నారు.
ఈ ఫినాలేకు ప్రముఖ నటుడు శ్రీకాంత్, నిధి అగర్వాల్, కేథరిన్ థ్రేసా, రాశీ ఖన్నా, దర్శకుడు మారుతి సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మారుతి, రాశిఖన్నాలు స్టెప్పులతో అదరగొట్టారు. కాగ ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు రాహుల్ విన్నర్‌గా తెలుస్తోంది.
దీనికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా నమ్మోద్దని.. లైవ్ షో ఈరోజు 6 గంటలకు మొదలు కానుందని షో హోస్ట్ నాగార్జున ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. శ్రీముఖి రాహుల్ లలో ఎవరో ఒకరు టైటిల్ గెలవనున్నారని సమాచారం.