ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దు

327
Gamgula Kamalakar
- Advertisement -

ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాయలో పడొద్దని సూచించారు మంత్రి గంగుల కమలాకర్. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి కరీంనగర్ లో మీడియా మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు డ్రైవర్ బాబు కుటుంబానికి కనీసం అంత్యక్రియలకు కూడా ఆర్థిక సహాయం అందించలేదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కార్మికులందరూ డ్యూటీ లో చేరాలని కోరారు.

బడుగు బలహీన వర్గాలకు చెందినవారే ఆర్టీసీలో ఎక్కువగా పని చేస్తున్నారని నాయకులు జీతాలు లేకుండా ఉండగలరని, కార్మికులు మాత్రం డ్యూటీ చేస్తేనే జీతం వస్తుందన్నారు. ప్రతిపక్షాల వల్ల ఆర్టీసీ కార్మికులకు మేలు ఏమీ జరగదని, పార్టీల జెండాలతో వచ్చి వారు ఏమీ చేయలేరన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు కార్మికులు విధుల్లో చేరాలన్నారు. ప్రతిపక్షాలు కార్మీకులను రోడ్డున పడేశాయన్నారు.

- Advertisement -