ఎమ్మెల్సీ కవితను కలిసిన బిగ్ బాస్ సొహైల్..

124
mlc kavitha
- Advertisement -

నిజామాబాద్ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల కవితను కలిశారు బిగ్ బాస్ ఫేం సొహైల్. పుష్పగుచ్చం ఇచ్చి కవితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

క‌విత‌తో క‌లిసి సోహెల్ దిగిన ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోహెల్ ప్రస్తుతం శ్రీనివాస్‌ వింజనం పాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్‌గా అభిజిత్ నిలవగా రన్నరప్‌గా అఖిల్ నిలిచారు. మూడో స్ధానంలో నిలిచిన సొహైల్ ప్రస్తుతం తన కెరీర్‌ని గాడిలో పెట్టుకునే పనిలో పడ్డారు.

- Advertisement -