కుమార్ సాయి బెస్ట్ : గంగవ్వ

286
gangavva

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదోవారంలో ఇంటి నుండి ఇద్దరు సభ్యులు బయటికి వచ్చారు. ఆరోగ్యం బాగాలేక గంగవ్వ బయటకు రాగా సుజాత ఎలిమినేట్ అయింది.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 4 బజ్‌ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది గంగవ్వ. తాను ఉన్నది ఉన్నట్లు చెబుతానని అదే తనకు చిన్నప్పటి నుండి అలవాటని పేర్కొంది. కుమార్ సాయి నిజాయితీగా ఆడతాడనని కితాబిచ్చింది. ఇక అఖిల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది గంగవ్వ.

కుమార్ సాయి- అఖిల్ వీరిద్దరిలో ఎవరు ఇష్టమని రాహుల్ సిప్లిగంజ్ ప్రశ్నించగా ఇష్టం అయితే?? మనవడంటే ఇష్టం ఉన్నా మంచోడు కాకుండా మంచోడని చెప్పుకుంటామా?? ఆడడు.. ఓడడు నిజాయితీ ఉండడు.. అలా ఉంటే ఉందని చూపిస్తారు. కానీ కుమార్ సాయి ఆట ఆడితే నిజాయితీగా ఆడతాడు. అఖిల్ నా కాళ్లు ఒత్తాడని మంచోడు కాకపోయిన మంచోడని చెప్తే నాకు విలువ ఉంటుందా? ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలే అని తెలిపింది.

అవినాష్….అమ్మా రాజశేఖర్ మాస్టర్‌ ఇద్దరిలో అవినాష్ బాగా నవ్విస్తారని ఇంటి సభ్యుల్లో అఖిల్-మోనాల్ జంట బాగుందని తెలిపింది. హౌస్‌లో సొహైల్‌కి కోపం ఎక్కువని ఇంట్లో ఉండే అర్హత హారికకు లేదని తెలిపింది గంగవ్వ. ఇంట్లో నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఏకైక వ్యక్తి కుమార్ సాయి అని తెలిపింది గంగవ్వ.