బిగ్ బాస్..ఎపిసోడ్ 16..మళ్లీ రచ్చ మొదలైంది

35
bb5

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 16 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ రచ్చరచ్చకు దారితసింది. ప్రియా- రవి మధ్య, ప్రియా- సన్నీ మధ్య గొడవతో ఇంట్లో పెరిగిపోయింది.

తొలుత శ్రీరామ్-హమీదాతో కొత్త ట్రాక్ మొదలుపెట్టగా విశ్వ, శ్రీరామ్‌ల ప్రవర్తనపై మానస్ తెగ ఫీల్ అయ్యాడు. విశ్వ కెప్టెన్ అయినతరువాత మారిపోయాడని చెప్పాడు. సన్నీ మంచోడే కానీ.. పనిదొంగ అని చెప్పుకొచ్చాడు. ఇక కాజల్ కోరిక మేరకు మటన్ బిర్యానీకి కావాల్సిన సామన్లను బిగ్ బాస్ పంపగా కాజల్ అతి కష్టం మీద హమీదా సాయంతో బిర్యానీ చేయడానికి రెడీ అయ్యింది.

ఇక విశ్వ.. షణ్ముఖ్‌తో తన కష్టాలను చెప్పుకున్నాడు. ఇక్కడికి వచ్చేముందు కూడా తన దగ్గరకు డబ్బులేవని ఏమైనా కొందాం అన్నా డబ్బులేవని …నాలుగు నెలలు అద్దె కూడా కట్టలేదని బాధపడిపోయాడు. తర్వాత షణ్ముఖ్‌ పగటిపూట నిద్రపోవడంతో కెప్టెన్‌గా ఉన్న విశ్వ స్విమ్మింగ్ పూల్‌లో 21 సార్లు దూకాలని శిక్షవేశాడు.

ఇక తర్వాత అసలు ఘట్టం మొదైలంది. ఈవారం నామినేషన్స్‌లో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరుచొప్పున నామినేట్ చేసి అందుకు గల కారణాలను చెప్పాలని కోరారు బిగ్ బాస్. మొదటగా శ్రీరామ్…మానస్‌.రవిని నామినేట్ చేశారు. తర్వాత సిరి… శ్వేతా, లహరిలను నామినేట్ చేస్తే…సన్నీ… ప్రియ, కాజల్‌ని, నటరాజ్ మాస్టర్.. సిరి, కాజల్‌ని, ఆనీ మాస్టర్.. శ్రీరామ్, మానస్‌ని, రవి.. శ్రీరామ్, జెస్సీని, లహరి.. ప్రియ, శ్రీరామ్‌ని, లోబో.. ప్రియాంక, శ్రీరామ్‌ని, ప్రియాంక.. లోబో, జెస్సీని, మానస్.. శ్రీరామ్,రవిని, ప్రియ.. లహరి, సన్నీలను నామినేట్ చేశారు.

ఇక నామినేషన్ సందర్భంగా ఒకరికొకరి మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. లహరి ప్రియను నామినేట్ చేస్తూ.. టాస్క్ అయిన తరువాత ప్రియ గారు తనకి దూరంగా ఉంటున్నారని ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ప్రతిదానికి పాయింట్ చేస్తుందని చెప్పింది లహరి. దీంతో ప్రియ నువ్ మగాళ్లతోనే కలుస్తున్నావ్ …స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లతో ఆడు గేమ్.. నువ్ వాళ్లని నామినేట్ చేయవు.. ఎందుకంటే నీకు మగాళ్ళతో ప్రాబ్లమ్ ఉండదు. నీకు మహిళలతోనే ప్రాబ్లమ్ అని అనేసింది ప్రియ.

అనంతరం లహరిని తిరిగి నామినేట్ చేసింది ప్రియ. దీంతో గొడవ మరింత పెద్దదైంది. నువ్ రవితో రెస్ట్ రూంలో లేట్ నైట్ హగ్ చేసుకుంటూ ఉన్నావు.. అది ఫ్రెండ్లీ హగ్ అయినా అయ్యి ఉండొచ్చు.. ఏమైనా అయ్యి ఉండొచ్చు అని అన్నది ప్రియ. ఆ మాట చెప్పగానే లహరి షాక్ అయ్యింది. రవి అంటే నాకు బ్రదర్ లా చూశా. మా ఇంట్లో వాళ్లని రిక్వెస్ట్ చేశా.. నా బ్రదర్ బర్త్ డే షర్ట్ పంపించండి అని సంస్కారం లేకుండా? మాట్లాడుతున్నావ్ అని ప్రియపై మండిపడింది. రవి కూడా అక్కా నువ్ తప్పు మాట్లాడుతున్నావ్ అని ప్రియపై గట్టిగా అరిచాడు.

లహరి నాకు హగ్ ఇచ్చిందనే కదా అంటున్నారు. అది జస్ట్ హగ్గే.. దానికి మీరు ఎంత కలరింగ్ ఇచ్చారు.. మిడ్ నైట్.. టాయ్ లెట్‌లో అని చెప్పడం ఎంతవరకూ కరెక్ట్ అని అడిగాడు. నేను సిరితో కాజల్‌తో ఉంటా.. వాళ్లతో ఉంటే మీకు ప్రాబ్లమ్ రాలేదు.. లహరితోనే మీకు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి.. ఇలా చేశారు అంటూ క్లాస్ పీకాడు. మధ్యలో ప్రియా పలుమార్లు నోరుజారడంతో రవి…ప్రియపై గట్టిగా అరిచేశాడు. తర్వాత లహరి-ప్రియలు ఇద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు.

ఇక ప్రియా…సన్నీని నామినేట్ చేస్తూ తన బిహేవియర్ నచ్చలేదని చెప్పడంతో సన్నీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశౄరు. ఒక అమ్మాయి గురించి ఇంత దారుణంగా మాట్లాడి మీరు పద్దతి గురించి మాట్లాడుతున్నారా అని చురకలు అంటించారు. తర్వాత రవి.. కల్పించుకుని మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రియ గారూ.. దయచేసి మా మధ్య బ్రదర్ సిస్టర్ రిలేషన్ తప్ప మరేం లేదు అని క్లారిటీ ఇచ్చారు.