BB9:బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 78 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ ప్రక్రియ రెండు దశల్లో జరిగింది. ముందుగా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నామినేషన్స్ జరిగాయి. ఆ తర్వాత, ‘వైల్డ్ ఫైర్’ నామినేషన్స్ మొదలవగా, హౌస్‌లో పెద్ద గొడవ చెలరేగింది.

ముందుగా కళ్యాణ్, డీమాన్‌ను నామినేట్ చేస్తూ, “లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో నువ్వు వేరే వాళ్ల కోసం ఈజీగా గివప్ ఇచ్చేశావు” అనే పాయింట్‌ను లేవనెత్తాడు. దీనికి డీమాన్ కోపంగా చూస్తుంటే నవ్వొస్తుందని కళ్యాణ్‌ని రెచ్చగొట్టాడు.తరువాత, డీమాన్ ఇమ్మానుయేల్‌ను నామినేట్ చేశాడు. “కెప్టెన్సీ టాస్క్‌లో నాకు సపోర్ట్ చేస్తానని మాటిచ్చి నువ్వు చేయలేదు” అని ఆరోపించాడు. దీనికి ఇమ్మానుయేల్, “నేను టీమ్ కోసం ఆడాను. అది టీమ్ కోసం ఆడాల్సిన గేమ్” అని డిఫెండ్ చేసుకున్నాడు.

ఇంతలో కళ్యాణ్ మధ్యలో దూరి, “నువ్వు (డీమాన్) ఆపోజిట్ టీమ్‌లో ఉన్న ఇమ్ముతో డీల్ పెట్టుకున్నప్పుడు, ఇక్కడ బ్లూ టీమ్ కోసం ఆడతానని ఎందుకు చెప్పావు?” అని ప్రశ్నించాడు. దీనికి డీమాన్ ఖండించాడు.రీతూ జోక్యం చేసుకుని, డీమాన్‌కు మద్దతుగా వాదించింది. డీమాన్ డీల్ పెట్టుకున్నా అది అతని పర్సనల్ అని అడ్డగోలుగా మాట్లాడింది. అప్పుడు కళ్యాణ్, “నువ్వు గతంలో నాపై అబద్ధపు నిందలు వేశావు. డీల్ పెట్టుకున్నానని నా మీద అరిచావు” అంటూ రీతూపై ఫైర్ అయ్యాడు.

కళ్యాణ్ పదే పదే తన మాట వెనక్కి తీసుకోకుండా వాదించడంతో, డీమాన్ కోపంతో ఊగిపోయాడు. ఒకానొక దశలో డీమాన్, కళ్యాణ్ పీక పట్టుకున్నాడు! వెంటనే ఇమ్మానుయేల్ జోక్యం చేసుకుని డీమాన్‌ని పక్కకు లాగాడు. అప్పటికే కోపంతో ఉన్న కళ్యాణ్, కోపాన్ని అదుపు చేసుకోలేక పక్కనే ఉన్న కుర్చీలను తన్నేశాడు. “డీల్ పెట్టుకుంది, మళ్లీ చెప్తుంది” అంటూ రీతూపై కూడా మళ్లీ ఫైర్ అయ్యాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

Also Read:అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్‌షో

- Advertisement -