BB9:పాల ప్యాకెట్ దొంగను కనిపెట్టారా?

10
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 59 రోజులు పూర్తి చేసుకుంది.ఇక ఈ వారం నామినేషన్స్ వాడివేడిగా జరుగగా తాజా ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్‌ మొత్తానికి టీ లేకుండా పాల ప్యాకెట్లన్నీ కొట్టేశాడు సుమన్ శెట్టి. అర్ధరాత్రి చేసిన ఈ దొంగతనంతో తెల్లారేసరికి ఎవరికీ టీ చుక్క కూడా లేకుండా పోయింది.

ఉదయం లేవగానే పాల ప్యాకెట్లు కనిపించడం లేదని రీతూ చౌదరి హడావిడి చేసింది. అందరూ సంజనని అనుమానించారు కానీ చివరికి కాదని తెలుసుకున్నారు. అయితే రాత్రి పాలు కొట్టేసిన సుమన్ – దివ్య మాత్రం మాములు యాక్టింగ్ చేయలేదు. దీంతో రెండో టాస్కు విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసు నుంచి మరొకరిని తప్పించే ఛాన్స్ రెబల్స్ అయిన దివ్య-సుమన్ శెట్టికి దక్కింది.

ఆ తర్వాత పాలప్యాకెట్లు కొట్టేసిన వారి కోసం అంతా సెర్చ్ ప్రారంభించగా రీతూ ఎక్కడ కనిపెట్టేస్తుందోనని దివ్య కాస్త కంగారుపడింది. కెప్టెన్ దివ్య దగ్గరికెళ్లి పాల దొంగతనం గురించి మాట్లాడాడు గౌరవ్. పాలు పోయాయి కదా దానికి ఎవరు రెస్పాన్సిబులిటీ అని గౌరవ్ అడిగాడు. రేషన్ మేనేజర్‌దే బాధ్యత కానీ అది డే టైమ్‌లో జరగలేదు కదా ఆమె రేషన్ మేనేజర్ అయినంత మాత్రాన రాత్రంతా ఫ్రిడ్జ్‌ని హగ్ చేసుకొని ఉండలేదు కదా అంటూ రీతూకి సపోర్ట్ చేసింది.

కాసేపటి తర్వాత హౌస్‌లో పెట్టిన ఫోన్‌కి బిగ్‌బాస్ కాల్ చేసి దివ్యతో మాట్లాడాడు. మీరు రెండో సీక్రెట్ టాస్క్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. కనుక మరొకరిని కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పించండి అనగా నిఖిల్‌ని తప్పిస్తున్నట్లు చెప్పింది దివ్య. ఇదే విషయాన్ని మళ్లీ ఫోన్ చేసి ఇమ్మానుయేల్‌కి చెప్పాడు బిగ్‌బాస్.

తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులతో మాట్లాడారు. ఇప్పటివరకూ జరిగిన ఆటని మీరు గమనించి ఉంటారు.. కనుక మీ దృష్టిలో ఎవరు రెబల్ అనేది మీరు ఒక్కొక్కరూ చెప్పాలి.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు కంటెండర్‌షిప్ రేసు నుంచి తప్పుకుంటారు అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఎక్కువమంది డీమాన్, పవన్ పేరు చెప్పగా పవన్‌ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడని బిగ్‌బాస్ చెప్పాడు.

తర్వాత ‘టచ్ ఇట్ స్మెల్ ఇట్ గెస్ ఇట్’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనికి సంజన సంచాలకులు. దీని కోసం యాక్టివిటీ ఏరియాలో ఘోస్ట్ రూమ్‌ టైప్‌లో చీకటి గదిని రెడీ చేశారు. దీని ప్రకారం ఆ గదిలో ఐదు ఐటెమ్స్ ఉంటాయి. చీకటిలో వాటిని టచ్ చేసి, స్మెల్ చేసి, గెస్ చేసి ఏంటో కరెక్ట్‌గా చెప్పాలి. ఎవరు ఎక్కువ కరెక్ట్ చెబితే ఆ టీమ్ విన్ అవుతుంది అని చెప్పారు. చీకటి గదిలోకి వెళ్లిన తనూజ.. ఐదింటిలో నాలుగు కరెక్ట్ చెప్పేసింది తనూజ. తిరిగి బయటికి వస్తుంటే దెయ్యం వేషాల్లో ఉన్న వాళ్లు భయపెట్టారు. దీంతో తనూజ గట్టిగానే ఏడ్చింది. బ్లూ టీమ్ నుంచి రీతూ చౌదరి లోపలికి వెళ్లడానికి రెడీ అయింది. జాగ్రత్త రీతూ లోపల భయపడతావ్ అని సంజన చెప్పింది. దీనికి ఏంటి భయమా? పులి ఆడపులి ఇక్కడ అంటూ లోపలికి ఎంట్రీ ఇచ్చింది రీతూ. తీరా లోపలికి వెళ్లగానే చీకటిగా ఉండటం.. ఏవేవో సౌండ్స్ రావడంతో రీతూలో భయం మొదలైంది. రీతూ 3 ఐటెమ్స్ గెస్ చేసింది. ఇక ఈ గేమ్‌లో తనూజ విన్ అయింది.

Also Read:బీహార్ తొలి దశ ఎన్నికలపై మోదీ

- Advertisement -