సీపీ సజ్జనార్‌కు సింగర్ చిన్మయి ఫిర్యాదు

13
- Advertisement -

సీపీ సజ్జనార్‌కు సింగర్ చిన్మయి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్య పదజాలం వాడుతూ కామెంట్లు పెడుతున్నారని …అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు చిన్మయి.

చిన్మయి శ్రీపాదని టార్గెట్ చేస్తూ ‘ఎక్స్’లో అసభ్య పదజాలంతో తిట్టారు ఆకతాయిలు. చిన్మయి లాంటివారికి అసలు పిల్లలు పుట్టకూడదని.. పుట్టినా చచ్చిపోవాలని కామెంట్ చేశారు చరణ్ రెడ్డి.

తన భార్య తాళి బొట్టు వేసుకోవడమనేది ఆవిడ ఇష్టమని ఇటీవల వ్యాఖ్యలు చేశారు చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్. ఈ విషయాలపై ‘ఎక్స్’ వేదికగా చర్చలు పెట్టారు చరణ్ రెడ్డి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

Also Read:BB9:పాల ప్యాకెట్ దొంగను కనిపెట్టారా?

- Advertisement -