బీహార్ తొలి దశ ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మొదటిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బీహార్‌లో తొలి దశ ఎన్నికలు ప్రారంభం కాగా ఎన్నికల బరిలో మొత్తం అభ్యర్థులు 1,314 మంది అభ్యర్థులు నిలిచారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కువినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొత్తం 243 స్థానాలకు రెండు విడతల్లో(నవంబర్ 6, 11) పోలింగ్ జరగనుండగా ఈ రోజు తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండు విడతల పోలింగ్ పూర్తయ్యాక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
बिहार में लोकतंत्र के महापर्व में जन-जन का अद्भुत उत्साह बता रहा है कि विधानसभा चुनावों में एनडीए को अभूतपूर्व बहुमत मिलने जा रहा है। ऊर्जा से भरे इसी माहौल के बीच करीब 11.30 बजे अररिया के फारबिसगंज और दोपहर लगभग 1.30 बजे भागलपुर की जनसभाओं में अपने परिवारजनों का आशीर्वाद प्राप्त…
— Narendra Modi (@narendramodi) November 6, 2025
Also Read:రేవంత్..ఓ అజ్ఞాని: కేటీఆర్

